- పటేల్ శ్రీ కృష్ణ 51వ జయంతి పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: సమాజ అభివృద్ధి, యువత సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. పటేల్ శ్రీ కృష్ణ 51వ జయంతిని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో యూత్ సభ్యులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ పి.శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు ముదిరాజ్, శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు భీమని ఆదిత్య ముదిరాజ్, అధ్యక్షులు సురేందర్, భాస్కర్, జయ సాయి, లక్ష్మణ్, ఉపాధ్యక్షులు శివనంద్ రెడ్డి, యూత్ సభ్యులు మధుసూదన్ యాదవ్, వంశీ కృష్ణ, రాజేష్, తరుణ్, నవీన్ యాదవ్, చందు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
