- లావణ్య మేకప్ స్టూడియోను ప్రారంభించిన డీసీపీ శిల్పవల్లి
నమస్తే శేరిలింగంపల్లి : స్వయంకృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నతస్థానం దక్కించుకోవచ్చని, మహిళలు స్వయంకృషితో ముందడుగు వేస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. బుధవారం మాదాపూర్ డివిజన్ చందానాయక్ తండాలో మండల లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మేకప్ స్టూడియోలో నూతన టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ మహిళలు స్వయంగా ఎదగడానికి ఇలాంటి వ్యాపారాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. లావణ్య మేకప్ స్టూడియో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మరెంతో మందికి ఆదర్శనంగా నిలవాలని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఈనాడు రాణిస్తున్నారంటే అదంతా వారి స్వయం కృషే నని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి, రాములు, హున్య నాయక్, వినోద్, లక్ష్మీ, కళ్యాణ్ పాల్గొన్నారు.