సమతుల్య ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ లో ప్రపంచ రక్త పోటు దినోత్సవంను పురస్కరించుకుని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్, నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆటోమొటెడ్ BP చెక్ పాయింట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు.

ప్రపంచ రక్త పోటు దినోత్సవ అవగాహన ర్యాలీలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని , ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంప రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బొటానికల్ గార్డెన్ లో హోలిస్టిక్ హాస్పిటల్ సౌజన్యం తో ఆటోమొటెడ్ BP చెక్ పాయింట్ సెంటర్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. అధిక రక్త పోటు వల్ల గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి జబ్బులు వస్తాయని, బీపీ నియంత్రణ లో ఉంటే అన్ని రకాల జబ్బులను ధైర్యంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో అటవీ అబివృద్ది సంస్థ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, దయాసాగర్ రావు సీనియర్ కార్డియాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ , CSI తెలంగాణ చప్టార్ హోలిస్టిక్ హాస్పిటల్ ఛైర్మెన్ రామచంద్ర , సుబ్బారావు , బీఆర్ ఎస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, బలరాం యాదవ్, గణపతి, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, వాకర్స్ పాల్గొన్నారు.

బిపి ని చెక్ చేసుకుంటున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here