నమస్తే శేరిలింగంపల్లి: ప్రకృతిని ప్రేమించే సంస్కృతి మనదని, మానవునికి ప్రకృతియే ప్రథమ గురువు అని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో మదర్ సేవ సమితి సోషల్ వెల్ఫేర్ & చారిటబుల్ ట్రస్టు ఛైర్మెన్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. పర్యావరణం పై అవగాహన కల్పించాలనే సంకల్పంతో కరపత్రాలు, డోర్ స్టికర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. చరాచర సృష్టియే ప్రకృతి, తల్లి, తండ్రి, గురువు దైవాలుగా పూజించే సంస్కృతి మనది, వారి ఆగ్రహానికి గురి అయితే మనుగడకు భవిష్యత్తుకు ఆటంకాలు తెచ్చి పెట్టుకున్నట్టే అని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామీకరణ వలన వ్యర్థ పదార్థాల విడుదల ప్లాస్టిక్ తయారీ అధికమౌతుంది, ఇకనుండి అయిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్లయితే పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవాసమితి సోషల్ వెల్ఫేర్ & చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు, సీనియర్ నాయకులు లింగారెడ్డి, రమేష్, ప్రభాకర్ రెడ్డి, శివ బాలరాజ్, వినయ్ పాల్గొన్నారు.