నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యమని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనిలో కాలనీ అసోషియషన్ అధ్యక్షుడు వేంకటేశం ఆధ్వర్యంలో పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి పార్కులో మొక్కలు నాటారు.
కాలనీలో సిసిరోడ్లు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కాలనీవాసులు కార్పొరేటర్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, కాలని వాసులు, కాలనీ సంక్షేమ సంఘాలు ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దుబే, మల్లేష్ గుప్తా, అక్బర్ ఖాన్, నరేందర్ భల్లా, అవినాష్ రెడ్డి, సందీప్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.