నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని, ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చని చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధిలోని పాత ముంబయి రహదారి నుండి అమీన్‌పూర్ వరకు పారిశుధ్య పనులను ఆమె చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా రోజురోజుకు విజృంభింస్తున్న వేళ ప్రజలు ఇంటి చుట్టూ పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోని తడి పోడి చేత్తను వేరువేరుగా జిహెచ్ఎంసి వాహనంలో వేయాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపు యజమానులు రోడ్ల పై చేత్తను పాడేయకుండా చెత్తకుండీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రజల క్షేమం కోసం అహర్నిషలు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది కి ప్రజలు సహకరించాలని కోరారు.
