విద్యార్థుల్లో ఒత్తిడిని అధిగమించడానికే పరీక్షా పే చర్చ: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎస్.ఎస్. డి గ్రామర్ స్కూల్ లో ఆల్విన్ కాలనీ కంటేస్టడ్ కార్పొరేటర్ రవీందర్ రావు ఆధ్వర్యంలో పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించారు.

గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

ఇందులో భాగంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా.. గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు పరీక్షా పే దోహదపడుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సృజన, ఉత్సాహం చూసాక, పరీక్షలను & వాటి ఒత్తిడిని తప్పకుండ జయిస్తారని నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, కమలాకర్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్, నర్సింగ్ యాదవ్, చారి, భూపాల్ రెడ్డి, బాలు యాదవ్, నరేందర్ రెడ్డి, రాజీ రెడ్డి, సీతా రామరాజు పాల్గొన్నారు.

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీలను పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here