నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జిహెచ్ఎంసి అధికారులు అధ్యక్షతన జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని 18 సంవత్సరాలు దాటినవారు తమపేరును ఓటర్ల జాబితాలోకి నమోదు చేసుకుని ఎన్నికలు నిర్వహించిన సమయంలో తప్పనిసరిగా తమ ఓటు వేయాలి అని, ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 యేళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న లక్ష్యంగా ప్రతి ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండేదని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణ చేసిన నేపథ్యంలో ఇకనుంచి నాలుగుసార్లు నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు పండు, మొగులయ్య, ఉమా దేవి , సరిత, అంగన్ వాడి టీచర్ రాధిక, రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. వెంకటేష్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, సీనియర్ నాయకులు వెంకటేష్, శేఖర్, ప్రభాకర్, రంగస్వామి ముదిరాజ్, విష్ణు, వెంకటేష్, చిన్న, నరేష్, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.