మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్ 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి అసెంబ్లీ , చందానగర్ డివిజన్ బీజేపి అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి ఆద్వర్యంలో నేడు పండిట్ దీన్ దయాల్ 106వ జయంతి సందర్భంగా తార నగర్ బతుకమ్మ కుంట లో మొక్కలు నాటి , వారి చిత్రపటానికి పూలమాల వేసి ఆ మహనీయునికి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏకాత్మ మానవతావాదం ప్రతిపాదించి , సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించిన మహోన్నత వ్యక్తి , జన్ సంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ , బీజేపి సీనియర్ నాయకులు చిన్నం సత్యనారాయణ , బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి డివిజన్ ఉపాధ్యక్షులు వేణు గోపాల్ , బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు సందీప్, సాయి మురళి పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ బీజేపి అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి ఆద్వర్యంలో బతుకమ్మ కుంటలో మొక్కలు నాటుతున్న బీజేపీ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, నాయకులు
బతుకమ్మ కుంట వద్ద పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here