- మొక్కలు నాటిన పలు పార్టీల నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతిని మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ లో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్తగా వ్యవహరించారని, 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి ఆయన అని కొనియాడారు. అంతేకాకుండా 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులై 1967లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలోనే కొనసాగాలని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం భారతీయ జనతా పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపథంలో పార్టీని నడిపించారు. చివరకు 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్, జంగయ్య యాదవ్, శ్రీశైలం కురుమ, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, ఆనంద్, లక్ష్మణ్, గణేష్, నరేష్, కొండయ్య యాదవ్, రాము, స్వప్న, రమేష్ నాయక్, కురుమయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
- ఆల్విన్ x రోడ్ వద్ద..
హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఆల్విన్ x రోడ్ వద్ద పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్ర పటానికి నివాళులర్పించారు.అలాగే వారి స్మృతి చిహ్నంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుచ్చి రెడ్డి, కలివేముల మనోహర్, జితేందర్, జగన్ గౌడ్, నవీన్, సుబ్బారావు పాల్గొన్నారు.
- గౌతమీనగర్, చందానగర్ లో..
గౌతమీనగర్, చందానగర్ లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఎలబద్రి శివరాజయ్య, కసిరెడ్డి సింధూరెడ్డి, వంశీధర్ రెడ్డి ఉన్నారు.