విష సంస్కృతి నుంచి మన సాంప్రదాయాలను కాపాడుకుందాం

  • AIFDW రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: పాచ్చ్యతిక విష సంస్కృతి నుంచి మన సాంప్రదాయాలను కాపాడుకుందామని AIFDW రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి అన్నారు. తెలంగాణ సాంప్రదాయక బతుకమ్మ పండుగ సందర్భంగా స్టాలిన్ నగర్ లో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలకు ఆమె హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ భారతదేశం అనేక సంస్కృతి, సాంప్రదాయ రంగాలకు వేదికని అన్నారు. అందులో తెలంగాణ సాంప్రదాయాలు అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ ఆడపడుచులు చేయి చేయి కలిపి పువ్వు పువ్వు పేర్చి బతుకమ్మను బతికించుకుంటున్నారని, ఈ బతుకమ్మను పాచ్చ్యతిక విష సంస్కృతి నుంచి కాపాడుకోవాలని మహిళా మణులకు పిలుపునిచ్చారు.  కష్టజీవుల జీవితాలను వినాశకం చేసే మందు మత్తు పదార్థాల నుండి యువత దూరంగా ఉండి సాంప్రదాయ బద్ధకంగా ఉండేందుకు అలవాటు చేసుకోవాలని అన్నారు.  మన సాంప్రదాయం కాపాడుకునేందుకు AIFDW రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మను నిర్వహిస్తుందని అన్నారు. స్టాలిన్ నగర్ లో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలోAIFDW గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు ఎం రాణి, జి లావణ్య, ధారా లక్ష్మి, ఎన్ రమ, వనం రాధ, వనజ, లావణ్య,  స్టాలిన్ నగర్ నాయకురాలు లతా, శ్యామల, కే.రాణి, పుష్ప  పాల్గొన్నారు.

స్టాలిన్ నగర్ లో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో ఆటపాటలతో ఆడపడుచులు
  • అపర్ణ పార్క్ హిల్స్ లో

అపర్ణ పార్క్ హిల్స్ లో బతుకమ్మ వేడుకలు వేడుకగా నిర్వహించారు. ఆడపడుచు లంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి,  సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అపర్ణ పార్క్ హిల్స్ లో బతుకమ్మలతో కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి,  సొసైటీ సభ్యులు
  • భవనీపురం కాలనీలో..

చందానగర్ డివిజన్ భవనీపురం కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.  తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను వేడుక గా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో  గౌరమ్మను వేడుకున్నారు.

చందానగర్ డివిజన్ భవనీపురం కాలనీలో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళామణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here