ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ అభ్యర్థి గా పల్లె మురళి

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఎంసిపిఐ(యు) పార్టీ మియాపూర్ డివిజన్ జిహెచ్ఎంసి ఎన్నికల అభ్యర్థిగా స్థానిక విద్యార్ధి నాయకుడు పల్లె మురళి ఖరారయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా పార్టీ విద్యార్ధి విభాగమైన అఖిల ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య లో కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ప్రస్తుతం జరుగనున్న    జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంసిపిఐయు పార్టీ తరపున మియాపూర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం పాటు పడతానని, డివిజన్ ప్రజలు, శ్రేయోభిలాషులు తనకు మద్దతు తెలపాలని అయన కోరారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here