ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపాటుకు గురైన మాదాపూర్ టీఆర్ఎస్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మాదాపూర్ నుండి పార్టీ టికెట్ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలతో నిరసన చేపట్టారు. శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ కేటాయించకుంటే టీఆరెస్ పార్టీకి మద్దతివ్వబోమని తెలిపారు. కాగా నిరసన చేపట్టిన నాయకులను ఎమ్మెల్యే గాంధీ సముదాయించే ప్రయత్నం చేసారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.