- ఘనంగా విశాఖ శ్రీ శారద పీఠాధీశుల జన్మదిన వేడుకలు
- నాగుల చవితి సందర్భంగా నాగదేవతలకు ప్రత్యేక పూజలు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధీశులు, జగద్గురువులు, యతీశ్వరస్వరూపులు, హిందు ధర్మపరిరక్షకులుశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయప్రధాన అర్చకులు, పీఠం రాష్ట్ర ఆగమసలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి చేతులమీదుగా గణపతి స్వామికి పేరున అభిషేకం, రుద్రహోమం, ఆయుష్షుహోమం జరిపారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులచే శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామివారికి పాదపూజ జరిపించారు. అదేవిధంగా నాగుల చవితిని పురస్కరించుకుని పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నాగదేవతలకు ప్రత్యేక పూజజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని స్మరించుకున్నారు.







