నమస్తే శేరిలింగంపల్లి: అయ్యప్పస్వామి మలా ధారణ విధి విధానాలను తెలియజేస్తూ.. ధర్మ మార్గములో తమను నడిపించి ప్రతిఫలం ఆశించని పంచ కైలాషి ప్రసాదరావు గురుస్వామి జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమ అదృష్టమని జగద్రక్షక శ్రీ ధర్మశాస్త పీఠం స్వాములు అన్నారు. పంచ కైలాషి అంటే (ఆదికైలాష్, శ్రీఖండ్ కైలాష్, కిన్నెర కైలాష్, మణిమహేష్, కైలాస మానససరోవరం) ఈ ఐదు కైలాసాలను దర్శనము చేసుకున్న వారని, భూమి మీద ప్రత్యక్షంగా పరమేశ్వరుని దర్శించుకున్నట్లు అని తెలిపారు.
అంతేకాక భారత దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రములు, తీర్ధ యాత్రలు దర్శించి, 12 జీవనదులలో పుష్కర స్నానములు చేసివచ్చిన పవిత్ర హస్తములతో మాల వేయించుకొనే భాగ్యం కలగడం తమ అదృష్టమని అన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలు, మనశ్శాంతి ప్రసాదించాలని ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని ప్రార్ధించారు. ఇందులోభాగంగానే “శ్రీతత్త్వమసి” సెక్రెటరీగాను విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆదివారం విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవాసంస్థ ద్వారా బాల సత్సంగము నిర్వహించారు.
భారత దేశ అంతరిక్ష పరిశోధకులచే ప్రపంచములోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ధృవము పై రోవర్ ను దించిన శుభసందర్భముగా బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అద్భుతమైన ఎన్నో కార్యక్రమములు తమతో చేయిస్తున్నవారి గురువుకి రుణపడి ఉంటామన్నారు. ఈ బలసత్సంగం, గురుస్వామి ప్రసాదరావు పుట్టిన రోజు వేడుకల్లో భక్తులు పెద్ద ఉత్తున పాల్గొని అల్పాహారం స్వీకరించారు.