నమస్తే శేరిలింగంపల్లి: ఎంతో కాలంగా తమతో పాటు అధ్యాపకుడిగా పనిచేస్తూ డిప్యూటేషన్ పై మరో విద్యాసంస్థకు బదిలీ అయిన లెక్చరర్‌కు తోటి అధ్యాపకులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని భెల్ టౌన్ షిప్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం లెక్షరర్ గా పనిచేసిన టి. సురేష్ కుమార్ కమిషనరేట్ హైయర్ ఎడ్యుకేషన్ కు డిప్యూటేషన్ పై వెళ్లనున్నాడు. దీంతో కళాశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ కే. అరుణబాయి ఆధ్వర్యంలో సహ అధ్యాపలకులు, కళాశాల సిబ్బంది సురేష్‌ను సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మురళీకృష్ణ, డాక్టర్ గోపాల్, సురేష్ కుమార్, బిక్షపతి, కావ్యలతో పాటు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






