శిల్పారామంలో ఉత్సాహంగా “లయ ఉత్సవ్”

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంత‌పు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శిన‌వారం సాయంత్రం లయ బీట్స్ అఫ్ ఆర్ట్, శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఆంఫి థియేటర్ లో “లయ ఉత్సవ్” నిర్వ‌హించారు. ప్ర‌ముఖ సంగీత గురువు ముర‌ళీ శిష్య బృందం కర్ణాటక గాత్రంలో గణేశా పంచరత్న కీర్తన, శ్యామలే మీనాక్షి, చక్కని తలికి చాంగుభళా, శరణు శరణు సురేంద్ర పాటలను ఆలపించారు. ప్ర‌ముఖ‌ లైవ్ ఆర్టిస్ట్‌ రవి గణేశుడి చిత్రాన్నిఆవిష్క‌రించారు. సాంప్ర‌దాయ నాట్య క‌ళాకారులు శ్రీనిధి, ఆరాధ్య, మనోజ్ఞ, వంశిక, ఆశ్రిత, దీక్షితలు భ‌ర‌త‌నాట్యంతో ఆక‌ట్టుకున్నారు.

భ‌ర‌త‌నాట్యంతో ఆక‌ట్టుకుంటున్న శ్రీనిధి, ఆరాధ్య, మనోజ్ఞ, వంశిక, ఆశ్రిత, దీక్షితలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here