వరద నీటిలో చిక్కుకున్న లారీ – డ్రైవర్, ఇద్దరు కూలీలను రక్షించిన ఓఆర్ఆర్ ప్యాట్రోల్ సిబ్బంది

నమస్తే శేరిలింగంపల్లి: వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్ , ఇద్దరు కూలీలను ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.
మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జిట్ No 15 అండర్ పాస్ వద్ద భారీ వర్షం పడటంతో వరద నీరు రోడ్డు పైకి రావటంతో సర్వీస్ రోడ్డును క్లోజ్ చేశారు. రాత్రి పూట ఎవరు లేని సమయంలో ఒక లారీ బ్యారికేడ్లను తీసి ఆ రోడ్డు గుండా వెళ్ళడానికి ప్రయత్నించడంతో వరద నీటిలో మునిగి పోయింది. లారీలో ఉన్న డ్రైవర్, ఇద్దరు కూలీలు టాప్ పై చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ORR పెట్రోల్ మొబైల్ సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివ శంకర్, గణేష్ వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలలో, వరద నీటిలో,. పోలీసులు నిషేధించిన ప్రాంతాలలో ఎట్టి పరిస్థితులలోను వెళ్లవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు.

నీట మునిగిన లారీ
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల సహాయంతో సురక్షితంగా బయటపడిన లారీ డ్రైవర్ , ఇద్దరు కూలీలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here