నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(NCRC) వినియోగదారుల హక్కుల పరిరక్షణలో యవత్ దేశవ్యాప్తంగా తనదైన శైలిలో విస్తృతంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో NCRC సేవలను మరింతగా విస్తృతం చేసే దిశగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా చింతకింది మహేందర్ గౌడ్ ని నియమిస్తూ.. కమిషన్ వ్యవస్తాపక జాతీయ చైర్మన్ ఎంవీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.