నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులు

  • సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ IX సమన్వయ సమావేశం
  • నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ 
  • సైబరాబాద్ వుమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత
సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ IX సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న సైబరాబాద్ వుమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సూచనల మేరకు.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ వుమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ స్ IX సమీక్ష సమావేశం ప్రారంభమైంది. వివిధ స్టేక్ హోల్డర్లు (డీస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ డిపార్ట్ మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టీం, బచ్ పన్ ఆందోళన్) పోలీసుల సమన్వయ సమావేశంలో పాల్గొని చిన్నారులను రక్షించే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందన్నారు. గత సంవత్సరం లో 1072 మంది వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సైబరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆపరేషన్ స్మైల్ లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఆపరేషన్ స్మైల్ డ్రైవ్ లో భాగంగా 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ర్యాగ్ పికర్స్, వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలిస్తామన్నారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయ కారణాల వల్ల బాలలు అణచివేతకు గురవుతున్న వారిని రెస్క్యూ చేసేందుకు కావాల్సిన సిబ్బందిని, సౌకర్యాలను సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐ‌పీఎస్., సమక్షంలో కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ లో చిన్నారులను ఎలా రక్షించాలనే అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి అసిస్టెంట్ లేబర్ కమీషనర్ వెంకట్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుజన, బచ్పన్ బచావో ఆందోళన్ ఇన్ చార్జి వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సమన్వయ సమావేశానికి హాజరైన వివిధ స్టేక్ హోల్డర్లు, పోలీస్ ఉన్నతాధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here