కళాకారుల ను ప్రోత్సహిస్తున్నాం

  • ప్రతి జిల్లాలో శిల్పారామాలను ఏర్పాటు
  • హ్యాండిక్రాఫ్ట్, సాంప్రదాయ వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్ కృషి
  • దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదు శిల్పారామం లో నేషనల్ హ్యాండీక్రాఫ్ ఫెయిర్ – 2023
    500 స్టాల్స్ ఏర్పాటు
  • వివిధ రాష్ట్రాల వారికి 250 స్టాల్స్ లలో అవకాశం
  • రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి డాక్టర్ .వి. శ్రీనివాస్ గౌడ్
మాదాపూర్ లోని శిల్పారామంలో ‘నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ – 2023, సంక్రాంతి సంబరాలు’ ను ప్రారంభిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పారామంలో ‘నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ – 2023, సంక్రాంతి సంబరాలు’ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేతివృత్తులకు, సాంప్రదాయ వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు శిల్పారామాలను రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నామన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ ఫెయిర్ ను శిల్పారామం లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులోని మాదాపూర్, ఉప్పల్ లలో శిల్పారామంలలో కళాకారుల ను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలో మహబూబ్ నగర్ లో శిల్పారామం ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ చేతివృత్తులకు, కళా ఖండాలకు, సృజనాత్మకత కలిగిన కళాకారులకు నిలయంగా ఉందన్నారు. నిజాం నవాబు కాలం నుండే అగ్గిపెట్టే లో పట్టే చేనేత చీరలను రూపొందించిన ఘనత మన కళాకారులకు దక్కిందన్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు, గద్వాల, వనపర్తి, నారాయణ పేట చీరలు, పెంబర్తి నగిషీలు, నిర్మల్ బొమ్మలు, సిరిసిల్ల చీరలు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విల్లేజ్ గా ఎంపికైందన్నారు. ఈ నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ ఫెయిర్ లో శిల్పారామం లో సుమారు 500 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో 250 స్టాల్స్ వివిధ రాష్ట్రాల కు చెందిన క్రాఫ్ట్ స్టాల్స్ కు అవకాశం కల్పించామన్నారు. ఈ ఫెయిర్ నేటి నుండి జనవరి 18 వరకు నిర్వహిస్తున్నామన్నారు హ్యాండిక్రాఫ్ట్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. స్టాల్స్ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్ మెంట్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ సయ్యద్ ముబారక్ అలీ, నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్ మెంట్ బోర్డు సౌత్ రీజినల్ డైరెక్టర్ ఏ. ప్రభాకరన్, జీఎం శిల్పారామం అంజయ్య, ఏడీఓ ఆర్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శిల్పారామంలో ‘నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ – 2023’ సందర్బంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నమంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here