రూ.55 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి 2 ఇంచుల ఎత్తు పెరిగాడు..

సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం సాధ్య‌మ‌వుతుంది. కానీ ఎత్తు పెరగ‌డం అనేది సాధ్యం కాదు. అయితే ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి రావ‌డంతో ఈ ప్ర‌క్రియ కూడా సాధ్య‌మ‌వుతోంది. కానీ అందుకు భారీగా డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. అయితే అంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఓ వ్య‌క్తి ఎత్తు పెరిగాడు.

అమెరికాలోని డ‌ల్లాస్‌కు చెందిన అల్ఫోన్సో ఫ్లోరెస్ అనే 28 ఏళ్ల వ్య‌క్తి 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండేవాడు. అత‌ను త‌న ఎత్తుతో సంతృప్తి చెంద‌లేదు. దీంతో అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న డాక్ట‌ర్ కెవిన్ డెబీప‌ర్ష‌ద్‌ను సంప్ర‌దించాడు. ఈ క్ర‌మంలో ఫ్లోరెస్‌కు డాక్ట‌ర్ కెవిన్ లింబ్ లెంథ‌నింగ్ కాస్మొటిక్ స‌ర్జ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో ఫ్లోరెస్‌కు రూ.55 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యింది. సర్జ‌రీ అనంత‌రం అత‌ను 6 అడుగుల 1 అంగుళం వ‌రకు ఎత్తు పెరిగాడు. కాగా అత‌నికి గ‌త ఆగ‌స్టు నెల‌లో స‌ర్జ‌రీ కాగా ప్ర‌స్తుతం అత‌నికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ స‌ర్జ‌రీ విక‌టిస్తే మాత్రం తీవ్ర‌మైన ప‌రిణామాలు ఉంటాయ‌ని అత‌నికి శ‌స్త్ర చికిత్స చేసిన వైద్యులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here