- రోడ్లు తవ్వి వదిలేస్తున్న వైనం
- ఇబ్బందుల్లో ప్రజలు
- పట్టించుకోని అధికారులు
- కాలనీలో నెలకొన్న సమస్యలపై రేపు డీసికి వినతి
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ శంకర్ నగర్ లో పలు సమస్యల పై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, కన్వీనర్ రాఘవేంద్రరావు, కాలని వాసులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధి కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టడానికి అవసరం లేని చోట రోడ్లను తవ్వి మరమ్మత్తులు చేయకుండా గాలికి వదిలేస్తున్నారని మంది పడ్డారు. ఈ కాలనీలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్న అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు కమిషన్లు ఇవ్వవలసిందేనని స్థానిక మహిళలు చెబుతున్నారని, ఇక్కడ రోడ్డు తవ్వి దాదాపు రెండు మూడు నెలలు గడిచిన వాటికి మరమ్మత్తులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు.
జిహెచ్ఎంసి అధికారులు అభివృద్ధి పనులను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులకు వంత పలుకుతున్నారని ప్రశ్నించారు. ఈ సమస్యలపై 6న స్థానిక డిప్యూటీ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందించి నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతామన్నారు. కార్యక్రమంలో ఎల్లేష్ , అనిల్ కుమార్ యాదవ్, చందర్ యాదవ్, రవి, ఎస్ఎస్ రావు, వెంకట్రావు, సత్యనారాయణ, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.