- కూకట్ పల్లి జోనల్ కమీషనర్ కి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ హిందూ శ్మశాన వాటిక కబ్జాపై నిఖిళేశ్వర బిల్డర్స్ పై విచారణ చేపట్టాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని కూకట్ పల్లి జోనల్ కమీషనర్ కి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై హైకోర్టు కు వెళ్లగా స్థానిక కూకట్ పల్లి తహసీల్దార్ విచారణ చేపట్టి B.మణెమ్మ ఎస్ రాజు నగర్ లేవుట్ లో ఉన్నదానికంటే కూడా బాగ్ అమీర్ శ్మశాన వాటిక బాగ్ అమీర్ గ్రామ సర్వే :-70 లోని 201 గజాల స్థలాన్ని కబ్జాచేసారని తహసీల్దార్ Lr:-B/2262/2022, తేదీ:- 18-05-2023 లేఖ ద్వారా నిర్దారించారన్నారు. తహసీల్దార్ ఇచ్చిన లేఖ పై నిఖిళేశ్వర బిల్డర్స్ WP no:- 13908/2023 కోర్టు కు వెళ్లగా హై కోర్టు స్టేటస్ కో ఇవ్వగ నిఖిళేశ్వర బిల్డర్స్ ఆర్డర్ వైలేట్ చేసి ( 2కోట్ల విలువ జేసే స్థలం ) లో అక్రమ నిర్మాణం చేశారని కూకట్ పల్లి జోనల్ కమీషనర్ దృష్టికి తీసుకెల్లారు.
దీనిపై జోనల్ కమీషనర్ స్పందిస్తూ స్థానిక కూకట్ పల్లి తహసీల్దార్ తో విచారించి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.