- బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసవి క్లబ్ లో బీసీలకు రాజ్యాధికారం రావాలని సమావేశం నిర్వహించారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజకీయంగా బీసీలు ఎదగాలని రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. రాబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించాలని పెద్ద సంఖ్యలో బీసీలు పోటీ చేసి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి యాదవ్ కు సన్మానం కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.