- శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు, శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి
- 29 మద్యం బాటిల్స్ స్వాధీనం, స్కూటీ సీజ్
నమస్తే శేరిలింగంపల్లి: అక్రమంగా మద్యం తయారు చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ బస్టాప్ వద్ద సైదు దేవి, సుమన్ కృష్ణ తన ఇంటిముందు అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. ఒక లీటర్ బాటిల్ లో మద్యం నింపి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు, శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అతడి వద్ద ఉన్న 39లీటర్ల మద్యాన్ని 29 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అతడి వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అనంతరం అతడిని జుడిషియల్ రిమాండ్ కి తరలించినట్లు శేరిలింగంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ జి. శ్రీకాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో పి & ఈ సి లు జి. గణేష్, నెహ్రూ, ఫకృద్దిన్, రాంబాబు, అపర్ణ పాల్గొన్నారు.