నమస్తే శేరిలింగంపల్లి: నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలన్నిటిని త్వరగా పరిష్కరించాలని కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ అన్నారు. జిహెచ్ఎంసి అధికారులను కలిసి వినతి పత్రం అందించి కాలనీలో నెలకొన్న సమస్యలను వారికి వివరించారు. ప్రధానంగా మురికి నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్లైట్ లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని , సిసి రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని జిహెచ్ఎంసి అధికారి ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ ఈ ఈ శ్రీనివాస్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈఈ సానుకూలంగా స్పందిస్తూ త్వరగా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అధికారులకు నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున భేరీ రామచందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షులు ఎండి కమ్మర్ పాషా, కే నరసింహ యాదవ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
