నమస్తే శేరిలింగంపల్లి: భారత దేశానికి సిద్ధించిన స్వాతంత్ర ఉద్యమంలో యువత పాత్ర చాలా గొప్పదని, నేటి మనువాదులు అల్లిస్తున్న మతోన్మాద, మనువాదులది స్వాతంత్ర పోరాటం కాదని విజ్ఞాన దర్శిని రాష్ట్ర కన్వీనర్ రమేష్ అన్నారు. మియాపూర్ ముజాఫర్ హమ్మద్ నగర్ లో నిర్వహించిన ఏఐఎఫ్ డివై రాష్ట్రస్థాయి రాజకీయ విజ్ఞాన తరగతులలో పాల్గొని మాట్లాడారు.
స్వాతంత్ర పోరాటంలో యువత పాత్ర, మతం మతోన్మాదం, దేశభక్తి, యువత కర్తవ్యం అనే అంశంపై తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో యువత పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. శాస్త్రీయమైన విధానాన్ని పాఠ్యాంశాలనుంచి తీసివేసి చరిత్రను కనుమరుగు చేసి విధానానికి నేటి మనువాదులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నేటి యువత నాటి వాస్తవ చరిత్రను నిలబెడుతూ… శాస్త్రీయమైన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏఐఎఫ్ డివై రాష్ట్ర కమిటీ సభ్యులు కర్రోల శ్రీనివాస్ ప్రిన్సిపల్ గా కొనసాగుతున్న ఈ క్లాసులలో రాష్ట్ర నిర్మాణ బాధ్యులు పెద్దారపు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి తుకారాం నాయక్, వస్కుల గోపి, మంద రవి,పల్లె మురళి గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎం.డి.సుల్తానా,డి. కీర్తి, ఇ.దశరథ్ నాయక్, కే షరీష్, జి శివాని, దేవనూరి లక్ష్మి నర్సింహా ,కన్నా శ్రీనివాస్ ఎల్ రాజు, అనిల్, భూసాని రవి, ఎండీ రజియా పాల్గొన్నారు.