గొప్ప జాతీయవాది సుభాష్ చంద్రబోస్: తాడిబోయిన రామస్వామి యాదవ్

  • న్యూ గుడ్ షెఫర్డ్ చెవిటి, మూగ పాఠశాల వద్ద  ఘనంగా సుభాస్ చంద్రబోస్ జయంతి
  • విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు, బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ
విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు, బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న తాడిబోయిన రామస్వామి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పరిధిలోని న్యూ గుడ్ షెఫర్డ్ చెవిటి, మూగ పాఠశాల వద్ద నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తదనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు, బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడని అన్నారు. గాంధీ, ఇతర జాతీయ నాయకులు అహింసతోనే స్వతంత్ర సముపార్జన చేయాలని ఆకాంక్షించినప్పటికి బోసు మాత్రం సాయుధ పోరాటంతోనే ఆంగ్లేయులను దేశం నుండి తరిమికొట్టవచ్చునని నమ్మి, దానిని ఆచరణలో పెట్టిన గొప్ప జాతీయవాది సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ‘జైహింద్’ అన్న గొప్ప నినాదాన్ని దేశానికి ఇచ్చిన గొప్ప మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. “నాకు రక్తం ఇవ్వండి. నేను స్వతంత్రం ఇస్తాను” అని నినదించి జాతిని జాగృతం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెర్సి, అధ్యాపకురాళ్ళు శోభ, శ్రీదేవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్, పాలం శ్రీను, విష్ణుప్రసాద్, జిల్ మల్లేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here