యువతకు మార్గదర్శి.. భవితకు దిక్సూచి నేతాజీ

  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నల్లగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రజల హృదయాలను గెలుచుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడని, రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఇదే సువర్ణవకాశమని,యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్‌లో పర్యటించి,జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘అజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం విద్యార్థిని, విద్యార్థులతో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటిషర్లపై పోరాడుదామని పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. యువతకు మార్గదర్శి, భవితకు దిక్సూచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు మహీంద్రా రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, వసంత్ కుమార్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, మున్నూరు సాయి, వినయ్, మల్లేష్, పాఠశాల పిల్లలు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here