కొండాపూర్ డివిజన్ యువమోర్చా అధ్యక్షుడిగా శేరి నవీన్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులుగా శేరి నవీన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్బంగా శేర్లింగంపల్లి అసెంబ్లీ బిజెపి కన్వీనర్ కే.రాఘవేంద్రరావు, కొండాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు ఆంజనేయులు సాగర్ ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ .. భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఇస్తున్నామని తెలిపారు. శేరి నవీన్ రెడ్డి మాట్లాడుతు కొండాపూర్ డివిజన్ లో బీజేపీ యువ మోర్చా బలోపేతం కోసం కృషి చేస్తానని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి , బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ , శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి కన్వీనర్ రాఘవేంద్ర రావు ,
బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ , కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు సాగర్ , బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ , శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని బీజేపీ రాష్ట్ర , జిల్లా , అసెంబ్లీ , నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి మహిళ నాయకురాలు వినయ కరుణాకర్ , పద్మ , రేణుక పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ యువమోర్చా అధ్యక్షుడిగా శేరి నవీన్ రెడ్డి కి నియామక పత్రాన్ని అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here