నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న వసంతోత్సవ నృత్యోత్సవం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తపస్య నృత్య కళాకేంద్రం గురువర్యులు కళామండలం లక్ష్మి అనిల్ తన శిష్య బృందం చేసిన మొహినియాట్టం నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. అంతేకాక తిరువాతిర, జతిస్వరం, కీర్తనం, అష్టలక్ష్మి, పదం, కరుకారే కర్మకిల్, పదం మొదలైన అంశాలను కళామండలం లక్ష్మి అనిల్, లీల వాసుదేవన్, దేవి కృష్ణన్, మాధురి, అర్చన, దేవి నందన, ఆశ, సౌమ్య, సరితా, ఐశ్వర్య, అశ్విని, గిరిజ ప్రదర్శించి మెప్పించారు.