నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాత్రి గౌడ్ జన్మదినం సందర్భంగా వారి ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాత్రి గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినదించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు చంద్రశేకర్ ప్రసాద్, కర్ణాకర్ గౌడ్, అక్తర్, బాలింగ్ యాదగిరి గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, సుదేశ్, శ్రీనివాస్ గౌడ్, సురేష్ నాయక్, వజిర్, హనీఫ్, జహీర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.