గౌడ విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాట

  • ఘనంగా గౌడ్ హాస్టల్ కు శంకుస్థాపన
  • రూ. 3 కోట్ల విలువైన భూమి విరాళమిచ్చిన దొంతి లక్ష్మీనారాయణ గౌడ్
  • నిర్మాణానికి రూ. 4 లక్షలు అందించిన అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ఆయన సోదరుడు రమేష్ గౌడ్
  • ప్రశంసలు కురిపిస్తున్న గౌడ కమ్యూనిటీ నాయకులు  
  • విద్యార్థుల సంక్షేమానికి  భూమి విరాళం అభినందనీయం: తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు గౌడ్
  • గౌడ్ ల అభ్యున్నతికి పాటు పడేందుకు ముందుకు రావాలని దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: ధనం ఎంత ఉన్నా నలుగురికి పంచే గుణం ఉన్నవాడే గొప్పవాడని తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు, హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ చైర్మన్ పల్లె లక్ష్మణరావు గౌడ్ అన్నారు. శుక్రవారం పటాన్ చెరువు మండల పరిధిలో నందిగామ గ్రామ పరిధిలో చందానగర్ కు చెందిన దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ సొంత స్థలం మూడు కోట్ల పైగా విలువచేసే భూమిని ఉచితంగా గౌడ కమ్యూనిటీ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం విరాళంగా అందజేశారు. గౌడ సంఘం నాయకులు హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ పాలకవర్గ సభ్యులు నందిగామకు విచ్చేసి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అదేవిదంగా అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ఆయన సోదరుడు రమేష్ గౌడ్ లు హాస్టల్ నిర్మాణానికి నాలుగు లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ గౌడ్ నరసింహ గౌడ్ లు మాట్లాడుతూ గౌడ జాతి అభ్యున్నతి కోసం ఆర్థికంగా ఉన్న ప్రతి గౌడ బిడ్డ ముందుకు వచ్చి కులాన్ని సంఘటిత పరుచుతూ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా ప్రతి గౌడబిడ్డ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరు విద్య పట్ల ఆసక్తి కనబరచాలని, అప్పుడే అన్ని రంగాల్లో ముందుకెళ్తామని సందర్భంగా గుర్తు చేశారు.

గౌడ హాస్టల్ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ చైర్మన్ పల్లె లక్ష్మణరావు గౌడ్, గౌడ సంఘం నాయకులు హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ పాలకవర్గ సభ్యులు
  • దాతలకు ప్రశంసల వెల్లువ  

సమాజంలో ధనవంతులు ఎంతమంది ఉన్నప్పటికీ దానం చేసే గుణం చాలా తక్కువ మందికే ఉంటుందని, అందుకు లక్ష్మీనారాయణ గౌడ్ నరసింహ గౌడ్ లే నిదర్శనమని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో కమ్యూనిటీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ యాదగిరి గౌడ్ సంజయ్ గౌడ్ రణం శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్ రాజయ్య గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here