నమస్తే శేరిలింగంపల్లి: ఆర్ ఏం పి వైద్యులకు సర్టిఫికెట్స్, ఐడి కార్డ్స్, తదితర సమస్యలపై హైదరాబాద్ కోఠి, ఆఫీస్ లో D.H. medical & health డాక్టర్. శ్రీనివాస్ రావు, తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ని తెలంగాణ రాష్ట్ర ఆర్ఏంపి వైద్యులు కలిసి విన్నవించారు. వారిలో వెంకట్ రెడ్డి, ఉక్కుల అశోక్, బాలకృష్ణ రెడ్డి, శివశంకర్. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న శిక్షణ తరగతులను ఆర్ ఏం పి వైద్యులకు నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేయాలని వారికి తెలిపారు.