ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు : తాడిబోయిన రామస్వామి యాదవ్

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోగుల ఆగయ్య నగర్ (మక్త) దగ్గర నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలే పండుగలని అన్నారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా విజయలక్ష్మి, T.వరలక్ష్మి వ్యవహరించారు. స్థానిక మహిళా నాయకురాళ్ళు భీమమ్మ, మాధవి, లలిత, పద్మ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు విష్ణుప్రసాద్ పాల్గొన్నారు.

పోగుల ఆగయ్య నగర్ (మక్త) దగ్గర నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు
రంగవల్లికలను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here