- పెద్ద ఎత్తున తరలివెళ్లిన గంగారాం గ్రామ ముదిరాజులు
నమస్తే శేరిలింగంపల్లి : బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పిలుపు మేరకు హక్కుల సాధన కోసం తాము సైతం అంటూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మగౌరవ సభకు గంగారాం గ్రామం ముదిరాజు నాయకులు, గ్రామస్తులు భారీ ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేశారు.
హలో ముదిరాజ్ – ఛలో హైదరాబాద్ అంటూ ముదిరాజులపై నమ్మకం లేని పార్టీలకు చరమగీతం పాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ముదిరాజులకు అన్యాయం చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో దొంతి శ్రవణ్ కుమార్ ముదిరాజ్, దొంతి శేఖర్ ముదిరాజ్, మారిని శివ ముదిరాజ్, దొంతి రాజు, దొంతి సాయి కిషోర్, దొంతి శేఖర్, మారిని వెంకట్, మస్కూరి కిరణ్ పాల్గొన్నారు.