శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ఖానమేట్ లో మైనారిటీ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి : మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా అన్ని హంగుల తో, సకల సౌకర్యాలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ లో 2000 గజాలలో (ఎంపీ నిధులు రూ. 50 లక్షలు, ఎమ్మెల్యే సీడీపీ, ఎస్డి పి నిధులు రూ. 50 లక్షలు ) రూ. 1 కోటి అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే మైనారిటీ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసి మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, షాది ముబారక్, రంజాన్ బట్టల పంపిణీతో పాటు, మైనార్టీ పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే 2000 గజాలలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ని నిర్మించనున్నట్లు తెలిపారు. అడిగిన వెంటనే స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్, రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలందరికి ఉపయోగపడే విధంగా మైనారిటీ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. తన దృష్టికి వచ్చిన ఏ చిన్న సమస్యనైనా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ శక్తులా కృషి చేస్తానని, ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు . మైనారిటీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో తన వంతు కృషి , సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అన్ని రకాల మౌళిక వసతులు కలిపిస్తామని, మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, ముస్లిం పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here