- ఓటు అమూల్యమైనది..ఆచితూచి ఓటు వేయాలి : సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్
- 27వ రోజు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగిన ఉచిత కంటి పరీక్షలు
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం 500 మందికి కంటి అద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ రానున్న నెల 15 రోజుల్లో నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగనున్నాయని ప్రజల కష్టసుఖాలను, మంచి, చెడులను పట్టించుకుని అభివృద్ధికి పాటుపడే నాయకుడినే ఎన్నుకోవాలని యువత, మహిళలు, వృద్ధులు, చదువుకున్న వారు, మేధావులు , సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు తెలిపారు.
కార్యక్రమంలో నరసింహ యాదవ్, జంగయ్య యాదవ్, ఆంజనేయులు సాగర్, చంద్రశేఖర్ యాదవ్, జయరాం, రాములు గౌడ్, నరసయ్య, మల్లేష్ యాదవ్, రామ్ రెడ్డి, రంగన్న, మేరీ పార్వతి, నాగుబాయ్ పాల్గొన్నారు.