- కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర
నమస్తే శేరిలింగంపల్లి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొవ్వ సత్యనారాయణ, సురభి రవీందర్ రావు ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ గంగారం ఆంజనేయ స్వామి గుడి నుండి హుడా కాలనీ, శాంతి నగర్ మీదుగా ప్రజా ఆశీర్వాద పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెబుతున్న 9 వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? ఎక్కడచూసిన అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనపడటం లేదా అని ప్రశ్నించారు. హఫీజ్పేట్ డివిజన్ లో అడుగడుగునా సమస్యలు ఉన్నాయని, బీఆర్ ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కి అవకాశం కలిపించాలని, శేరిలింగంపల్లిలో కమలం వికసించిన వెంటనే మీ అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొవ్వ సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సురభి రవీందర్ రావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, ఆళ్ళ వర ప్రసాద్, రవి గౌడ్, బాబు రెడ్డి, చలపతి, కృష్ణంరాజు, శ్రీకాంత్, జగన్ గౌడ్, నరేందర్ రెడ్డి, చిట్టా రెడ్డి ప్రసాద్, రమణయ్య, భూపాల్ రెడ్డి, కె.నర్సింహా రెడ్డి, కె.వి.సుబ్బారావు, కుమార చారీ, పృథ్వి గౌడ్, శోభ దూబే, అరుణ కుమారి కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.