- సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత కంటి పరీక్షలు
నమస్తే శేరిలింగపల్లి : కంటి చూపు మందగించిన పేదలకు వెలుగులు నింపడమే తమ ట్రస్ట్ లక్ష్యమని సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్, ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ యాజమాన్యం మాట్లాడుతూ ఎంతోమంది కంటి చూపు మందగించి సరిగ్గా చూడలేక అంధకార జీవితాన్ని గడుపుతున్న తరుణంలో తమ వంతు సహాయంగా సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను అందజేస్తున్నామని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ అయినా, అభివృద్ధి అయినా చేసేది తామేనని, ఈసారి ఆశీర్వదించండి ప్రజాసేవ, అభివృద్ధి , సంక్షేమం చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు సాగర్, రాధాకృష్ణ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, చెన్నయ్య, సంతోష్ , ఆత్మారావు , వంశీ కుమార్, బన్సీలాల్ , మున్నా యాదవ్ ,చందు, రేఖ, సరోజా రెడ్డి, మేరీ, సంతోష రెడ్డి, పద్మ ఆకుల నరసయ్య పాల్గొన్నారు.