- కొనసాగుతున్న సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్, చందానగర్ డివిజన్ సంబంధించిన మక్త మహబూబ్ పేట్, పి ఏ నగర్, స్వర్ణపురి హెచ్ఎంటి కాలనీవాసుల కోసం మక్త చౌరస్తాలో సందయ్య మెమోరియ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించి 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ప్రజాసేవలో నిమగ్నమై, ఎంతోమంది పేద ప్రజల కుటుంబాలను ఆదుకున్న చరిత్ర తమకు ఉన్నదని, నియోజకవర్గంలో రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తమ కుమారుడు రవి కుమార్ యాదవ్ బరిలో ఉంటున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాగులు గౌడ్, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, మాణిక్ రావు, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, శివరాజ్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, బాబు ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, అశోక్ ముదిరాజ్, శివారెడ్డి, వెంకటేష్, మల్లేష్, గోపి, వినోద్ యాదవ్, విజయేందర్, సురేష్ గౌడ్, మహ్మద్ గౌస్, శివ, శంకరయ్య, పవన్ యాదవ్, రవికాంత్, గౌతమ్, ముఖేష్, పాల్గొన్నారు.