మహాసభలను జయప్రదం చేద్దాం

  • ఆటో అండ్ టాక్సీ డ్రైవర్లకు భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహసంఘ్‌, ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ వాల్ పోస్టర్ ను మజ్దూర్ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్లపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో చందానగర్, శేర్లింగంపల్లి ఆటో స్టాండ్ ల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో, టాక్సీ డ్రైవర్లందరూ మహాసభలలో బారి సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు బాబురావు యాదగిరి, యాదయ్య, రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here