- పోషకాహారం లోపాన్ని అధిగమించడంలో గణనీయ పాత్ర పోషించే బెస్ట్ స్కీమ్
- పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- ప్రభుత్వ పాఠశాలలోని 22 వేల మంది విద్యార్థులకు వర్తించనున్న పథకం
నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాలలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేసి మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి విద్యార్థుల తరుఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల విద్యార్థులకు ఉపయోగపడుతుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 73 ప్రభుత్వ పాఠశాలలో 22 వేల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్టం అన్నారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందన్నారు. సిఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ విద్యార్థుల కడుపు నింపడమే కాక స్కూల్స్ లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే గొప్ప పథకం అను కొనియాడారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.