జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకగా మాతృదినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మదినాగూడ వద్ద డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధవ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ సమాజంలో ప్రతి పౌరుడు మంచి నడవడిక సత్ప్రవర్తనతో మెలగడానికి ప్రతి మాతృమూర్తి కృషితో పాటు ప్రతి కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది ఎంతో విలువైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీర మహిళ అధ్యక్షురాలు కావ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీ స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తుందని జనసేన మహిళల సమస్యల పై ఎల్లవేళలా పోరాటం చేస్తుందని, వారికి ఎపుడూ అండగా ఉంటుందని, అదే విధంగా సమాజంలో నేడు జరగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రతి కుటుంబంలో ఉన్నత విలువలు పెంపొందించడంలో తల్లి ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన భావజాలం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మద్దూరి నాగ లక్ష్మి, వారి బృందాన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి వారికి తులసి మొక్కలతో పాటు వృద్ధులకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ , వీర మహిళ వెంకటలక్ష్మి, ఉపేందర్, నరసింహ, శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, అశోక్, సిహెచ్ శ్యామల, శారద, రేఖ, దుర్గ, పద్మ శిరీష, అంజలి, జయమ్మ, స్వప్న జనసైనికులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాతృదినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here