మణికొండలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి… కుటుంబ కలహాలే కారణం..?

నమస్తే శేరిలింగంపల్లి: తల్లీ కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ ఆంధ్రా బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న సదానందంకు భార్యా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బుద్దోలు అలివేలు(40) గురువారం తన భర్త(సదానంద)కు వ్యక్తిగత అవసరాల కోసం రూ.5 వేలు ఇచ్చి యాదగిరి గుట్టను సందర్శించి రమ్మని చెప్పింది.

లాస్య (14)

అనంతరం ఇంట్లోని పాతబట్టలను కాల్చి వేసింది. కుమారుడు మణికంఠ ప్రశ్నించగా నీకేం తెలియదు ఇక్కడి నుండి వెల్లమంటూ గద్దించడంతో ఆ బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం రాత్రి 9 గంటలకు నిద్రించిన వారు అర్ధరాత్రి 2.45 గంటలకు తన కుమార్తె లాస్య (14)కు బెడ్ రూములో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసింంది. కూతురు చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత తాను వంటగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

బుడ్డోలు అలివేలు ( 40 )

మధ్యరాత్రి మెలుకువ వచ్చి లేచిన మణికంఠకు అతని అక్క, అమ్మ ఉరివేసుకుని ఉండటాన్ని చూసి 100కి ఫోన్ చేశాడు. రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసక్తికర విషయమేంటంటే కూతురు చేతిపై గోరింటాకుతో గేమ్ ఈజ్ స్టార్టెడ్, డూ సంథింగ్ దట్ మేక్ హ్యాపీ అని రాసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కాల్చివేసిన పాతబట్టలు

చేతిపై గోరింటాకుతో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here