- చందానగర్ డివిజన్ లో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలో ఓటమి భయంతోనే కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి శేరిలింగంపల్లి ఎం. ఆర్. ఓ కార్యాలయం వరకు ధర్నా చేశారు. ఎం. ఆర్. ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ సారధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సున్నా అని, దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల్ని నమ్మించడానికి చేస్తున్న దశాబ్ది దగా కార్యక్రమం అని.. నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మరెళ్ల శ్రీనివాస్ రావు, సురేష్ నాయక్, బాచిపాక యాదగిరి, రేణుక, రాజెంద్ర ముకయ్య, జహంగీర్, రాజన్, దుర్గం శ్రీహరి, దుర్గేష్, కవిరాజ్, శేఖర్, చిరుమర్తి రాజు, సాయి కిషోర్, వాహిదా, నాగ మల్లేష్, రూబెన్, సుజాత, సూర్య రాథోడ్ , కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.