నమస్తే శేరిలింగపల్లి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితం వల్లే మహిళ బిల్లు ఆమోదం పొందిందని చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.
పార్లమెంటులో మహిళ బిల్లును ప్రవేశపెట్టాడాన్ని హర్షం వ్యక్తం చేస్తు వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజా రమణితో కలిసి చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.