నమస్తే శేరిలింగంపల్లి : వినాయక చవితి పండుగ పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అజయ్ నగర్, ప్రేమ్ నగర్, సిద్దిక్ నగర్ లలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గణనాథుని దర్శించుకున్న అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ ఈసారి కూడా వినాయక చవితి పండుగ పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషకరమని, శేరిలింగంపల్లి వాసులు అందరకీ కూడా ఆవిఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందచేయాలని, వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నానని తెలిపారు. కార్యక్రమములో తెప్ప బాలరాజు ముదిరాజ్, కాకర్ల అరుణ, అంజద్ అమ్ము దిలీప్ రాకేష్, లడ్డు రాహుల్, సునీల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.