నమస్తే శేరిలింగంపల్లి: త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును బిజెపి కి వేసి పార్టీ అభ్యర్థి రాంచందర్‌రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్రనాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి కసిరెడ్డి సింధూ రెడ్డితో కలిసి మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో పట్టభద్రులను కలిసి తమ ఓటును వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంచందర్ రావు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని, నిరంతరం సమస్యలపై స్పందించే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావు ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసుఫ్, మాజీ సైనికుడు నాగం రాజశేఖర్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






